తేట తెలుగు సంవత్సరాది
 రానే వచ్చింది షడ్రుచుల ఉగాది

చిగురాకులతో ప్రకృతికి ఆకు పచ్చని అలంకారాలు
తీయ తీయని కోకిల కిలకిలలు

వసంత రుతువు ఆగమనం
అందరి మదిలో ఆహ్లాదం

విజయా నామ సంవత్సరం
ఇక వలదు మనకు ఓటమి భయం

క్రోధం రుచి కారం
చేదు గుర్తు చేస్తుంది విచారం
 ఆనందం అందరికి తీపి
అవమాన భారం పులుపు
ఉప్పు నేర్పుతుంది  భయం
మామిడి వగరు అంటే అర్థం ఆశ్చర్యం
ఇవన్ని కలిస్తేనే జీవితం
ఇదే ఉగాది పచ్చడి సారం

తోటి వారికి అవమానం
కాకూడదు నీకు రాజ్యపూజ్యం
ఆరోగ్యమే నిజమైన ఆదాయం
దానగుణమే అసలైన వ్యయం 
మంచి చెడు చెప్పడమే రాశి ఫలం
ఇక ఆపై అంతా నీ కష్ట ఫలం
ఇదే పంచాగ శ్రవణ సారాంశం

భక్ష్యాలు బొబ్బట్లు పానకం వడపప్పు
ఏది వదలొద్దు వ్యాయామం మరవొద్దు
ఇదే నా ఉగాది సందేశం
ధన్యవాదాలు ఇచ్చినందుకు అవకాశం